సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
SDPT: కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామంలో రూ.23 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను మార్కెట్ కమిటీ ఛైర్మన్ బోయిని నిర్మల, సర్పంచ్ బోయిని సంపత్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ నిధులను మంత్రి పొన్నం ప్రభాకర్ మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామాభివృద్ధికి కృషి కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.