బురదమయంగా మారిన ఆర్టీసీ బస్టాండ్

ప్రకాశం: మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ బురదమయంగా మారిందని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వర్షపు నీరు నిలిచాయని ప్రయాణికులు చెబుతున్నారు. కాగా, చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులు బురదలో నడిచి రావలసిన దుస్థితి ఏర్పడిందని, మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నరు.