ఉపాధిహామీ పాదయాత్రకు కేతిరెడ్డి మద్దతు

ఉపాధిహామీ పాదయాత్రకు కేతిరెడ్డి మద్దతు

సత్యసాయి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని కొనసాగించాలని సీపీఐ ఆధ్వర్యంలో అనంతపురం నుంచి బండ్లపల్లి వరకు చేపట్టిన పాదయాత్ర శనివారం కొనసాగింది. ఈ యాత్రకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మద్దతు ప్రకటించి పాదయాత్రలో పాల్గొన్నారు. గ్రామీణ పేదల బతుకుదెరువుకు ఆధారమైన ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేయవద్దని నేతలు డిమాండ్ చేశారు.