క్రీస్తు సువార్త సభలో ఎమ్మెల్యే

కృష్ణా: ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పామర్రు నియోజకవర్గంలో అడ్డాడ, పమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామాల్లో పర్యటించారు. బుధవారం రాత్రి క్రీస్తు సువార్త సభలో ఆయన పాల్గొన్నారు. దైవ సేవకుల నుంచి ఆశీర్వచనాలు పొందారు. అనంతరం గ్రామ క్రైస్తవులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.