కోరుట్లలో బోణీ కొట్టిన బీఆర్‌ఎస్..!

కోరుట్లలో బోణీ కొట్టిన బీఆర్‌ఎస్..!

కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ సర్పంచ్ ఎన్నికల్లో బోణీ కొట్టింది. ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి కానుగంటి లాస్య రాజశేఖర్ ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. చివరి రోజున ఒకే నామినేషన్ దాఖలు కావడంతో అధికారులు ఆమెను ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ విజయంతో బీఆర్ఎస్‌కు నియోజకవర్గంలో శుభారంభం లభించింది.