VIDEO: వలకి చిక్కిన 20 కిలోల చేప

NLG: మత్స్యకారుని వలకు భారీ చేప చిక్కింది. అడవి దేవుల మండలం నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ డ్యాం వద్ద 20 కిలోల భారీ బొత్స చేప చిక్కిందని మత్స్యకారుడు గువ్వల చిన్న సైదులు తెలిపారు. నాగార్జునసాగర్ డ్యాం గేట్లు ఎత్తడంతో వరద నీరు భారీగా వస్తున్న నేపథ్యంలో పెద్ద పెద్ద చేపలు వస్తున్నాయని మత్స్యకారులు పేర్కొన్నారు. భారీ చేపలు పడుతుండడంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.