కలెక్టరేట్ ఎదుట ఫీల్డ్ అసిస్టెంట్ల ధర్నా

కలెక్టరేట్ ఎదుట  ఫీల్డ్ అసిస్టెంట్ల ధర్నా

NLG: ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ సంఘం యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా అధ్యక్షుడు బబ్బురి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లు సోమవారం రాయగిరి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. గత మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.