INSPIRATION: పి. సుశీల
పులపాక సుశీల భారతీయ సినిమా సంగీత చరిత్రలో చెరగని ముద్ర వేసిన గాయని. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సహా అనేక భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డ్ సాధించారు. సుమారు 5 దశాబ్దాల పాటు సినీ సంగీతంలో శిఖరాగ్రాన నిలిచిన ఆమెను 'గాన కోకిల' అని అభిమానులు పిలుచుకుంటారు. ఆమె 5 జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్(2008)తో సత్కరించింది.