బాలికను రక్షించిన కానిస్టేబుల్ ను ప్రశంసించిన ఎస్పీ

స్దానిక వైఎస్‌ఆర్ నగర్ ప్రాంతంలో అపార్టుమెంట్లో 17 ఏళ్ల అమ్మాయి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్టుగా బుధవారం డయల్ 112కు ఫిర్యాదు వచ్చింది. ఈ నేపథ్యంలో విజయనగరం రెండవ పట్టణ కానిస్టేబుల్ ఆర్.జగదీష్ సకాలంలో స్పందించి ఆత్మహత్య ప్రయత్నం నుంచి అమ్మాయిని రక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కానిస్టేబుల్‌ను అభినందించి, ప్రశంసా పత్రం అందజేశారు.