పులివెందులలో మైదుకూరు ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం

KDP: పులివెందుల నియోజకవర్గంలోని యర్రబల్లిలో మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం, శాంతియుత పాలన కోసం కూటమి జెడ్పీటీసీ అభ్యర్థి మారెడ్డి లతాని గెలిపించాలని కోరారు. ప్రతి ఓటు పులివెందుల భవిష్యత్తును నిర్ణయించే ఓటు అవుతుందని, సైకిల్ గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.