దోమకొండ పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదు: ఎస్సై

KMR: కామారెడ్డి సెగ్మెంట్ దోమకొండ మండలం కేంద్రానికి చెందిన అవధూత నర్సింలు(49) అనే వ్యక్తి ఈ నెల 25న మేస్త్రి పనికి వెళ్లి వస్తా అని చెప్పి వెళ్లి ఇంకా ఇంటికి తిరిగి రాలేదని, మంగళవారం అతని కొడుకు సిద్ధిశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై స్రవంతి తెలిపారు. ఎక్కడైనా నర్సింలు కనిపిస్తే పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని కోరారు.