ఏపీఐఐసీ ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన

ఏపీఐఐసీ ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన

అనంతపురంలో ఏపీఐఐసీ ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ను మంగళవారం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అనంత ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్, ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, కలెక్టర్ ఆనంద్, టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్‌లు పాల్గొన్నారు. ముందుగా భూమికి ప్రత్యేక పూజలు చేసి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.