'మొక్కలను పెంచండి పర్యావరణాన్ని కాపాడండి'

తూ.గో: మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలని టీడీపీ సీనియర్ నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు అన్నారు. శుక్రవారం అల్లిపూడి జడ్పి హైస్కూల్లో గ్రామీణ ఉపాధి పథకం ద్వారా మంజూరైన మొక్కలను ఆయన నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కల పెంపకంపై విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలని, నాటిన ప్రతీ మొక్కను సంరక్షించేందుకు కృషి చేయాలన్నారు.