మరికల్ మండలంలో రోడ్డు ప్రమాదం

మరికల్ మండలంలో రోడ్డు ప్రమాదం

NRPT: మరికల్ మండల కేంద్రంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మండల కేంద్రానికి చెందిన శివలక్ష్మి(52) రోడ్డు దాటుతుండగా, పస్పుల గ్రామానికి చెందిన మైనర్ బాలుడు బైకుపై వేగంగా వచ్చి ఢీ కొట్టాడు. దీంతో ఇద్దరికి గాయాలు కావడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.