మా దిష్టి తగిలితే పవన్ గెలిచేవారా..?: అనిరుధ్ రెడ్డి

మా దిష్టి తగిలితే పవన్ గెలిచేవారా..?: అనిరుధ్ రెడ్డి

TG: ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధు రెడ్డి మండిపడ్డారు. 'మీ రాజకీయాలు మీ రాష్ట్రంలో చూసుకోవాలి. తెలంగాణ ప్రజల గురించి మాట్లాడటం తప్పు. తెలంగాణ వాళ్ల దిష్టి తగిలిందనడం దారుణం. ఇక నుంచి మాపై మాట్లాడితే ఊరుకునేది లేదు. మా దిష్టి తగిలితే పవన్ గెలిచేవారా? పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలి' అని డిమాండ్ చేశారు.