చీమకుర్తిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
ప్రకాశం: చీమకుర్తి మండలంలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. మరమ్మత్తు పనుల కారణంగా నాయుడుపాలెం, బండ్లమూడి, మంచి కలపాడు, చీమలమర్రి, వై. గుడిపాడు, టి. గుడిపాడు గ్రామాలలో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని డీఈఈ మోహన్ రావు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.