యూరియా అక్రమ రవాణాపై అధికారులతో కలెక్టర్ సమవేశం

NDL: జిల్లాకు మంజూరైన రాయితీ యూరియా ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు అక్రమ రవాణా జరగరాదని, ఇందుకు అవసరమైన పటిష్ఠ నిఘా, చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో యూరియా అక్రమ రవాణాపై వ్యవసాయ శాఖ, పోలీస్, సివిల్ సప్లై, ఇండస్ట్రీస్, విజిలెన్స్ తదితర అధికారులతో సమావేశం నిర్వహించారు.