జిల్లాలో భారీ వర్షం.. విద్యుత్ తీగలపై కూలిన చెట్లు
TPT: సత్యవేడు నియోజకవర్గంలో సోమవారం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. నియోజకవర్గంలోని పలు మండలాల్లో కుండపోతం భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో అటు వాహనదారులు, ఇటు సామన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా మండలంలో వర్షం ధాటికి జనజీవనం స్తంభించిపోయింది. విద్యుత్ తీగలపై చెట్లు కూలండంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.