సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఇంఛార్జ్

సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఇంఛార్జ్

అన్నమయ్య: ఓబులువారిపల్లి మండలంలోని ముక్కవారిపల్లి గ్రామంలో గురువారం సిమెంట్ రోడ్డుకు భూమి పూజ కార్యక్రమం జరిగింది. రైల్వే కోడూరు టీడీపీ ఇంఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం పట్ల స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.