గండిపాలెం ఆలయంలో ఆరుద్ర నక్షత్ర శేషాభిషేకాలు
NLR: ఉదయగిరి మండలం గండిపాలెం జలాశయ ఆవరణలో వెలసిన శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని పరమేశ్వరునికి ఆదివారం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని భక్తులు స్వామి వారికి పంచామృత, సుగంధ ద్రవ్యాలతో విశేషాభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు, అలంకరణలు అనంతరం గోత్ర నామాలతో అర్చనలు చేయించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులు ఉప ఆలయాలను దర్శించుకున్నారు.