సెల్‌ఫోన్ టెక్నాలజీతో బాలిక ఆచూకీ లభ్యం
KKD: ప్రత్తిపాడు గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక చదువు విషయంలో ఆమె తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఇంట్లో ఉన్న రూ.15 లక్షలు విలువ చేసే నగలు, రూ. 50,000 నగదు తీసుకుని నిన్న ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటనపై బాలిక తల్లిదండ్రులు ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్సై లక్ష్మీకాంతం సెల్‌ఫోన్ టెక్నాలజీతో బాలిక ఆచూకీని కనుగొన్నారు.