రైతులకు అండగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే

NLR: అన్నం పెట్టే అన్నదాతలకు అండగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ఇవాళ ఇందుకూరుపేటలో ఉన్న అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ ఛైర్మన్ అమర్నాథ్ రెడ్డి, డైరెక్టర్‌ల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు తదితరులు హాజరయ్యారు.