'విద్యార్థిని కథకి జాతీయస్థాయి బహుమతి'

NZB: సిరిపూర్ ZPHSకు చెందిన 10వ తరగతి విద్యార్థిని టీ.అక్షయకు జాతీయ స్థాయిలో పోటీలో బహుమతి లభించిందని హెచ్ఎం వీ.సత్యనారాయణ తెలిపారు. ఇటీవల సైన్స్ ఫిక్షన్ కథల పోటీలు హైదరాబాదులోని బాల సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో జరిగాయి, ఈ పోటీలకు తమ పాఠశాల విద్యార్థులు రాసిన 15 కథలలో టీ.అక్షయ రాసిన "రూపాలు మార్చుకునే రోబో " అనే కథ ఉత్తమ కథగా ఎంపికైందని తెలిపారు.