ఇద్దరు కొడుకులను చంపి తల్లి ఆత్మహత్య

ఇద్దరు కొడుకులను చంపి తల్లి ఆత్మహత్య

HYD: కూకట్‌పల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఓ తల్లి తన ఇద్దరు కుమారులను హతమార్చి అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.