బాలికల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

NGKL: బిజినేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల భవనం, తరగతి గదులు, ప్రాంగణం, పరిసరాల పరిశుభ్రతను సమీక్షించారు. విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల హాజరు పరిస్థితులపై ప్రధానోపాధ్యాయురాలిని అడిగి తెలుసుకున్నారు.