వృద్ధులకు పండ్లు పంపిణీ

వృద్ధులకు పండ్లు పంపిణీ

ఆదిలాబాద్: PRTU తెలంగాణ సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తలమడుగు మండలంలోని సాయిలింగి వృద్ధాశ్రమంలో వృద్ధులకు సంఘం నాయకులు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం దేశానికి వెన్నెముక లాంటి రైతులను సన్మానించారు. కార్యక్రమంలో PRTU జిల్లా అధ్యక్షుడు నూర్ సింగ్, ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి మోహన్ సింగ్, వివిధ మండలాల సభ్యులు పాల్గొన్నారు.