నవోదయలో హైదరాబాద్ రీజియన్ హ్యాండ్‌బాల్ మీట్

నవోదయలో హైదరాబాద్ రీజియన్ హ్యాండ్‌బాల్ మీట్

VZM: ఎస్.కోట మండలంలోని కిల్తంపాలెం జవహర్ నవోదయ విద్యాలయంలో హైదరాబాద్ రీజియన్ హ్యాండ్‌బాల్ మీట్ దిగ్విజయంగా కొనసాగుతుందని ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలోని ఎనిమిది క్లస్టర్లకు చెందిన అథ్లెట్‌లు పాల్గొన్నారని విజేతలుగా ఎంపికయ్యే అథ్లెట్లు బీహార్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు.