లబ్ధిదారునికి CMRF చెక్కు అందచేత

లబ్ధిదారునికి CMRF చెక్కు అందచేత

WGL: సీఎం సహాయనిధి నిరుపేద ప్రజలకు ఒక వరం అని చెన్నారావుపేట మాజీ ఎంపీపీ కేతిడి వీరారెడ్డి అన్నారు. మండలంలోని జల్లి గ్రామానికి చెందిన జరుపుల శేఖర్‌కి సీఎం సహాయనిది కింద రూ. 27 వేలు మంజూరయ్యాయి. స్థానిక MLA దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఉదయం ఈ చెక్కును లబ్ధిదారు కుటుంబానికి అందజేశారు.