“ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో పాల్గొన్న MLA
NZB: జిల్లా కేంద్రంలోని భూమారెడ్డి కన్వెన్షన్‌లో ఇవాళ నిర్వహించిన “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో MLA ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. నగర అభివృద్ధి, పారిశుద్ధ్యం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేయడానికి అందరి సహకారం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు.