ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
VKB: పరిగి పట్టణంలో రూ. 27 కోట్ల వ్యయంతో 100 పడకల ప్రాంతీయ ఆస్పత్రి నిర్మాణ పనులను MLA టి. రామ్మోహన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అత్యవసర చికిత్స, డయాలసిస్ సహా ఆధునిక వైద్య సదుపాయాలను పేద ప్రజలకు అందించాలన్నారు. అత్యాధునిక వసతి సౌకర్యాలతో ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు తెలిపారు.