VIDEO: విద్యుత్ కాంతుల్లో పుట్టపర్తి
సత్యసాయి: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం దైవలోకాన్ని తలపిస్తోంది. శుక్రవారం రాత్రి ఆశ్రమం అంతా విద్యుత్ కాంతులతో విరాజిల్లింది. పట్టణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్చ్‌లు, ఫ్లెక్సీలు అలంకరణలతో స్వర్ణ కాంతిని వెదజల్లాయి. ప్రతి భవనం, గోపురం దేదీప్యమానంగా మెరిసిపోగా ఆ అందాలు స్థానికులను ఆకట్టుకున్నాయి.