VIDEO: సింహాచలంలో రాజీవ్ కనకాల సందడి
VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గరుడ సేవలో ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాల పాల్గొన్నారు. స్వామివారికి జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, గరుడ వాహనంపై ఊరేగుతున్న నృసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. గరుడ సేవలో పాల్గొనడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.