అర్హులందరికీ రేషన్, ఆధార్ కార్డులు: మంత్రి సంధ్యారాణి

NLR: రెండు నెలల్లో అర్హులందరికీ ఆధార్, రేషన్ కార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖలపై అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు.