డెవలప్‌మెంట్ చేస్తే సహకరిస్తా: సబితా ఇంద్రారెడ్డి
RR: సీఎం రేవంత్ రెడ్డి డెవలప్‌మెంట్ చేస్తే సహకరిస్తానని, కానీ పేదల కడుపు కొడతానంటే సహించనని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ డివిజన్లోని హనుమాన్ నగర్ బస్తి వాసులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సీఎం ఎక్కడ పేదలకు అన్యాయం చేసినా మేము అడ్డం పడతామని, బీఆర్ఎస్ పేదలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.