'మంత్రిని కలిసిన MP నగేశ్'
ADB: తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు నగేశ్ హైదరాబాదులో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని పెండింగ్ రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెండింగ్ పనుల ప్రతిపాదనలను వెంటనే పంపాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు MP పేర్కొన్నారు.