'ఫార్మర్ రిజిస్ట్రీలో వివరాలు నమోదు చేసుకోవాలి'
MNCL: ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో వివరాలను నమోదు చేయించుకోవడం తప్పనిసరి అని జన్నారం మండలంలోని పోన్కల్ క్లస్టర్ ఏఈవో త్రిసంధ్య కోరారు. అధికారుల ఆదేశాల మేరకు గురువారం పోన్కల్ రైతులు వేదికలో పలు గ్రామాల నుంచి వచ్చిన రైతుల వివరాలను ఆన్లైన్‌లో నమోదు చేశారు. కేంద్రం పీఎం కిసాన్ నగదు ప్రయోజనాన్ని పొందాలంటే ప్రతి రైతు వివరాలను నమోదు చేయించుకోవాలన్నారు.