మేడారం జాతరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

మేడారం జాతరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

జనగామ జిల్లా స్టేషన్‌గన్‌పూర్ పట్టణంలో మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సుల సర్వీసులను ఆదివారం డిపో మేనేజర్ స్వాతి , సీఐ వేణు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. భక్తుల కోసం సురక్షిత ప్రయాణ ఏర్పాట్లు చేయగా, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఆధార్‌తో ఉచిత ప్రయాణం కల్పించినట్లు డిపో మేనేజర్ తెలిపారు.