ఆర్టీసీ డిపోలో అంబేద్కర్ జయంతి వేడుకలు

ఆర్టీసీ డిపోలో అంబేద్కర్ జయంతి వేడుకలు

KMM: మధిర ఆర్టీసీ డిపోలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు డిపో మేనేజర్ ఆర్.రామయ్య ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. డిపో ఉద్యోగులు సమష్టిగా పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు. కార్యక్రమంలో డిపో సిబ్బంది పాల్గొన్నారు.