పండగలతోనే ఆత్మీయత: మంత్రి

WNP: పూర్వికులు ఆనవాయితీగా ఆచరించే పండగలతోనే ఆత్మీయత, ఆనందమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం కొత్తకోటలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రలో పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకొని ఐక్యతచాటాలని మంత్రి పిలుపునిచ్చారు.