'గ్రామీణ వైద్యుల సమస్యలను పరిష్కరించాలి'

MHBD: గ్రామీణ వైద్యుల సమస్యలను పరిష్కరించాలని తొర్రూరు ఆర్ఎంపీ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ మండల గౌరవ అధ్యక్షులు సింగారపు భీమయ్య అన్నారు. శనివారం ప్రధమ చికిత్స దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ రెండవ శనివారం ప్రథమ చికిత్స దినోత్సవంగా జరుపుతారన్నారు. ప్రభుత్వం గ్రామీణ వైద్యులకు ప్రభుత్వ గుర్తింపును కల్పించాలని డిమాండ్ చేశారు.