ఫిల్మ్‌నగర్‌లో BMW కారు బీభత్సం
TG: హైదరాబాద్ ఫిలింనగర్‌లో BMW కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. కారు ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారులోని యువకుడికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.