తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయుల ధర్నా
ELR: తమ హక్కులను పరిరక్షించి, డిమాండ్స్ నెరవేర్చాలంటూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు జంగారెడ్డిగూడెం మండలం తహసిల్దార్ కార్యాలయం వద్ద గురువారం ధర్నా చేపట్టారు. సుమారు 40 డిమాండ్లని ప్రభుత్వం ముందు ఉంచారు. అపరిస్కృతంగా ఉన్న విద్యారంగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, జనరల్ సమస్యలు వెంటనే పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని ఉపాధ్యాయులు కోరారు.