రైలు ఢీకొని వృద్ధురాలు మృతి

మహబూబ్ నగర్: రైలు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి రైల్వే ట్రాక్‌పై బుధవారం జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ మల్లేశ్వర్ వివరాల ప్రకారం.. పెద్దాయపల్లి గ్రామానికి చెందిన బొట్టు మైసమ్మ (60) రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.