సీఎం, డిప్యూటీ సీఎంల ఫోటోలు మార్ఫింగ్ పై కేసు నమోదు
NTR: CM, Dy.CM ఫొటోలను మార్ఫింగ్ చేసి SMలో దుష్ప్రచారం చేసిన వ్యక్తిపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. సీఎం, డిప్యూటీ సీఎంల ప్రతిష్ఠను దెబ్బతీసేలా తప్పుడు చిత్రాలు, సందేశాలు షేర్ చేస్తున్నాడన్న ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో రాజశేఖర్ రావు అనే వ్యక్తిపై ఐటీ యాక్ట్‌తోపాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.