VIDEO: అధికారుల నిర్వాకంతో ప్రజలకు ఇబ్బందులు

VIDEO: అధికారుల నిర్వాకంతో ప్రజలకు ఇబ్బందులు

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ 8వ వార్డులో 15 రోజుల క్రితం కల్వర్టును మున్సిపల్ అధికారులు కూలగొట్టడంతో ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు. శిధిలమైన కల్వర్టు ద్వారా ప్రయాణం చేయడంతో ప్రమాదాలు పాలవుతున్నామని వాహనదారులు పేర్కొన్నారు. మరోవైపు కాలువలో నీరు తమ ఇళ్లల్లోకి వచ్చేస్తుందని ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మున్సిపల్ అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.