అక్కడే మిమ్మల్ని పాతిపెట్టేస్తాం: ఇరాన్
ఇరాన్ ఆర్మీ గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్ జనరల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆక్రమణదారులను పాతిపెట్టే శ్మశానంగా తమ దేశం మారుతుందని హెచ్చరించారు. పశ్చిమాసియాలో అమెరికా సైనికులను మోహరిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'మీ బలగాలను మేం రాతి యుగానికి కంటే వెనక్కి పంపిస్తాం. ఇరాన్ సైన్యపు కమాండోలు కఠోరమైన శిక్షణ పొంది, పోరాటానికి సిద్ధంగా ఉన్నారు' అని ఆయన పేర్కొన్నారు.