పోలీసుల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

SRD: రాయికోడు పోలీసులు ఎక్స్ రోడ్ వద్ద రోడ్డు మూసివేసినట్లుగా బోర్డులు శుక్రవారం రాత్రి ఏర్పాటు చేశారు. కుసునూరు వాగు ఉదృతంగా ప్రవహించే అవకాశం ఉన్నందున పోలీసులు రాత్రి 9:30 గంటలకు ఆ మార్గాన్ని మూసివేస్తూ బోర్డు ఏర్పాటు చేశారు. ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలని సూచించారు. అలాగే యూసుఫ్ వాగు పొంగే అవకాశం ఉందని వాగును దాటవద్దని సూచించారు.