'రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి'

'రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి'

ప్రకాశం: కనిగిరి నుంచి హనుమంతుని పాడు మండల కేంద్రం వరకు నిర్మాణం చేపట్టిన ఆర్‌అండ్‌బీ ఓవీ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని సీపీఎం నాయకులు బడుగు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత కొంతకాలంగా రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్నాయని తుఫాన్ కారణంగా పనులు ఆగిపోయాయని అన్నారు. అధికారులు స్పందించి వెంటనే రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరారు.