తుఫాన్‌ను ఎదుర్కొనడానికి సర్వసన్నద్దం : కలెక్టర్
VZM: మొంథా తుఫాన్‌ను ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం సర్వ సన్నద్దంగా ఉందని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అప్రమత్తంగా ఉన్నామని అన్నారు. ఆయన సోమవారం తమ ఛాంబర్‌లో మీడియాతో మాట్లాడుతూ తుఫాను సన్నద్దతను వివరించారు.