జిల్లాకు పర్యాటక మణిహారంగా కైలాస గిరి
విశాఖ పట్టణానికి పర్యాటక మణిహారం కైలాస గిరి. సుమారు 360 అడుగుల ఎత్తున కొండపై విస్తరించి ఉన్న ఈ ఉద్యానవనం పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తోంది. శివ, పార్వతిల భారీ విగ్రహాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణ. కొండపైకి వెళ్లడానికి రాష్ట్రంలోనే మొదటి రోప్ వే మార్గం ఇక్కడే ఉంది. పర్యాటకులు భారీగా తరలివస్తుండడంతో జిల్లాకు ఒక ఆదాయంలాగా కూడా కైలాసగిరి తోడ్పడుతుంది.